హైదరాబదీలా మజాకా : 90 రోజుల్లో రూ.8.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు

హైదరాబదీలా మజాకా : 90 రోజుల్లో రూ.8.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు

తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్లు గణనీయంగా పెరిగాయి.  నగరంలో 8.3 లక్షల చలాన్లు జారీ చేయబడ్డాయి. 2023 డిసెంబర్ 1 నుండి 2024 ఫిబ్రవరి 22 వరకు వాహనాలపై మొత్తం రూ.8 కోట్ల 59 లక్షల 20 వేల జరిమానాలు విధించారు. ఆర్టీఐ డేటా ప్రకారం ఈ టైమ్ లో సుమారుగా 6.15 లక్షల చలాన్ల పెండింగ్ కేసులు ఉన్నాయి.  

ద్విచక్ర వాహనాలపై అత్యధిక కేసులు నమోదు కాగా, 5.90 లక్షల కేసులు నమోదు కాగా, రూ.17.59 కోట్ల జరిమానాలు విధించబడ్డాయి.ఇందులో కేవలం 1.41 లక్షల కేసులు మాత్రమే రూ.2.10 కోట్ల చలాన్ మొత్తాన్ని చెల్లించగా..  4.49 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలతో పాటుగా భారీ వాహనాలు కూడా భారీ జరిమానాలను ఎదుర్కొన్నాయి.  

ద్విచక్ర వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల సంఖ్య పెరగడంపై ఆర్టీఐ కార్యకర్త కరీం అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిర్వహణ సమస్యలను పరిష్కరించడానికి, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న జరిమానాలను క్లియర్ చేయడంలో పురోగతి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు  రూ. 3.8 కోట్లు జరిమానా చెల్లించారు.