ట్రాఫిక్​ పోలీసులకు కాంప్లిమెంటరీ కిట్స్

ట్రాఫిక్​ పోలీసులకు కాంప్లిమెంటరీ కిట్స్

మల్కాజిగిరి, వెలుగు: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించడంలో సమర్దవంతంగా పనిచేసిన ట్రాఫిక్​ పోలీసులను రాచకొండ సీపీ సుధీర్​బాబు అభినందించారు. జోన్​-2 పరిధిలోని 730 మంది ట్రాఫిక్​ సిబ్బందికి ఒక్కొక్కరికీ కాంప్లిమెంటరీగా సుమారు రూ. 7800 విలువైన కిట్​ను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 41,83,664 ఖర్చుతో ఈ కిట్లను అందిస్తున్నట్టు తెలిపారు. వీటిలో 9 రకాల వస్తువులు ఉన్నాయని .. వాటిలో వాటర్​ రెసిస్టెంట్​ బ్యాగ్​, ఎల్​ఈడీ లాఠీ, రిఫ్లెక్టివ్​ జాకెట్, రెయిన్ కోట్, వాటర్ బాటిల్, జంగిల్ షూ, గాగుల్స్, హెడ్​ గేర్​ వంటి పరికరాలు ఉన్నట్టు తెలిపారు. ట్రాఫిక్​ విధుల నిర్వహణలో స్వీయ-క్రమశిక్షణ, భద్రత అవసరం అని తెలిపారు.