కాకా స్పూర్తితోనే క్రీడలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాక వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టీ20 టోర్నీలో భాగంగా డిసెంబర్ 26న కరీంనగర్ జిల్లా వర్సెస్ రాజన్న సిరిసిల్ల ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా మంత్రి వివేక్, పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్.. బీసీసీఐ ఇంత స్ట్రాంగ్ గా ఉండేందుకు కాకానే కారణమని చెప్పారు. ఉప్పల్ స్టేడియం అభివృద్ధికి కాకా ఎంతో కృషి చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. యువతను క్రికెట్ లో ప్రోత్సహించేందుకు టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు వివేక్.
అన్ని జిల్లాల్లో క్రికెట్ టోర్నమెంట్ లు బాగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వెంకటస్వామి స్మారకంగా టోర్నమెంట్ నిర్వమించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం నుంచి ఇండియా టీమ్ లో మరింత మంది రాణించాలి. గ్రామీణ యువతకు ఈ టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు పొన్నం.
