హైఅలర్ట్.. కేంద్ర నిఘా వర్గాల నీడలో హైదరాబాద్​

హైఅలర్ట్.. కేంద్ర నిఘా వర్గాల నీడలో హైదరాబాద్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనతో కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఓవైపు సీడబ్ల్యూసీ సమావేశాలు, మరోవైపు బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన వేడుకల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా యి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న తాజ్‌‌కృష్ణా, కాంగ్రెస్ సభ జరగనున్న తుక్కుగూడ, బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ సహా ఆయా ఏరియాల్లోని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌, స్థానిక పోలీసులతో కలిసి మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశాయి. 

లాడ్జీల్లో తనిఖీలు.. 

సికింద్రాబాద్​లోని పరేడ్​గ్రౌండ్​లో జరగనున్న తెలంగా ణ విమోచన దినోత్సవ వేడుకల కోసం భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్‌‌ను శుక్రవారం రాత్రి నుంచే కేంద్ర బలగా లు తమ అధీనంలోకి తీసుకున్నాయి. గ్రౌండ్ పరిస రాల్లోని లాడ్జీలు, రెస్టారెంట్లలో స్థానిక పోలీసులు ముందస్తు తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో నిరతంర నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానితులను గుర్తిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్‌‌పై పోలీస్ బందోబస్తు, బైనాక్యూలర్స్​తో నిఘా పెంచారు. 

Also Raed:     స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నక్రికెటర్ ​గంగూలీ

సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు..    

సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ నేతలు రావడంతో శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. సోనియా, రాహుల్‌‌, ప్రియాంక సహా కాంగ్రెస్ ముఖ్య నేతలకు పటిష్ట బందోబస్తు కల్పించారు. అనుమతులు ఉన్న వారిని తప్ప ఇతరులను ఎయిపోర్ట్‌‌లోకి అనుమతించలేదు. వీఐపీల కాన్వాయ్ వెళ్లే రూట్లలో కిలోమీటర్ దూరం నుంచే సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగే తాజ్‌‌కృష్ణా, సభ జరిగే తుక్కుగూడలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.