Hyderabad : CISF పరేడ్ లో పాల్గొన్న అమిత్ షా

Hyderabad : CISF పరేడ్ లో పాల్గొన్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా 54 వ సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన  అమిత్ షా.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అమిత్ షా మార్చి 11 రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సంజయ్  స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా  నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ- (NISA)కి వెళ్లారు. అక్కడ  బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో  అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.