
నేడు, రేపు ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రానున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమలో మంగళ, బుధ, గురువారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే దక్షిణ అండమాన్ సముద్రం ఏరియాల్లో ఈ నెల 30న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన హైదరాబాద్ వాతావరణ శాఖ.. 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని సూచించింది.
కావునా రైతన్నలు, చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు జాగాత్రగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మార్కెట్లో వరి ధాన్యం తడిసిపోకుండా ముందుగానే కవర్లతో అలెర్ట్ గా ఉండాలంటూ తెలుపారి. సోమవారం కూడా పలుచోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.