మరో మూడ్రోజులు భారీ వానలు

మరో మూడ్రోజులు భారీ వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. బుధ, గురువారాల్లో 24 జిల్లాలకు, శుక్రవారం 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

బుధవారం కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో.. గురువారం కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

శుక్రవారం నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో 10 సెంటీమీటర్లు, హైదరాబాద్​లోని గోల్కొండలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా అనేక జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.