గ్లోబల్​ సిటీగా ఉన్న హైదరాబాద్​ .. టెక్నికల్​ హబ్​గా మారుతోంది

గ్లోబల్​ సిటీగా ఉన్న హైదరాబాద్​ .. టెక్నికల్​ హబ్​గా మారుతోంది

కూకట్​పల్లి, వెలుగు: గ్లోబల్​ సిటీగా ఉన్న హైదరాబాద్​ ప్రస్తుతం టెక్నికల్​ హబ్​గా మారుతోందని నీతి ఆయోగ్​ సభ్యుడు డాక్టర్ ​వీకే సరస్వత్​ అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం పదుల సంఖ్యలో టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ సిటీకి రావడం అభినందనీయమన్నారు. శనివారం కూకట్ పల్లి జేఎన్టీయూ  క్యాంపస్ లో జరిగిన గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సరస్వత్ మాట్లాడతూ.. ప్రస్తుతం 40 ఇనిస్టిట్యూషన్స్​ కొత్త కాన్సెప్ట్స్​తో సిటీకి వస్తున్నాయన్నారు. సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్న జేఎన్టీయూ స్టూడెంట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సైన్స్అండ్ టెక్నాలజీ డిపార్ట్​మెంట్ సెక్రటరీ శ్రీవారి చంద్రశేఖర్, 'సెయింట్​' ఫౌండర్​ అండ్​ ఎగ్జిక్యూటివ్​ చైర్మన్​ బీవీఆర్​ మోహన్​రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు.