
హైదరాబాద్: సెల్పీ వీడియో తీసుకొని ఓ గృహిణి ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొంది. తల్లి ఆత్మహత్య చేసుకొంటుందని చివరి నిమిషంలో గుర్తించిన పిల్లలు తండ్రికి సమాచారమిచ్చారు. తండ్రి వచ్చేసరికి ఆమె మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకొంది. హైదరాబాద్ లాలాగూడలో బేకరి నడుపుతోన్న వ్యక్తికి ఆత్మహత్య చేసుకొన్న మంజులకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. మంజుల భర్త బేకరిని నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
ఆదివారం ఉదయం వివాహిత మంజుల ఆత్మహత్య చేసుకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మంజుల ఆత్మహత్య చేసుకొందని చెబుతున్నారు. మంజుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంజుల ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమా… ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.