కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

హైదరాబాద్ నిజాం కళాశాల ముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మను యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. రాజగోపాల్ రెడ్డి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం సిగ్గుచేటని హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ మండిపడ్డారు. బీజేపీ పార్టీలో కనీస విలువ లేని ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీనీ, రేవంత్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంకోసారి రాజగోపాల్ రెడ్డి నోరు జారితే చెప్పు దెబ్బలు తప్పవని మోత రోహిత్ హెచ్చరించారు.

కాగా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఉప ఎన్నిక వచ్చే అవకాశముండటంతో ఆ నియోజకవర్గ  ఎన్నికల వ్యూహం, ప్రచారం కోసం ఏఐసీసీ ఓ కమిటీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహం, ప్రచార కమిటీలో ఏడుగురికి చోటు కల్పించింది. మధుయాష్కీ గౌడ్ కమిటీ కన్వీనర్ గా ఉండగా.. రాం రెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, ఎస్ఏ సంపత్ కుమార్. ఈరవత్రి అనిల్ కుమార్ లను సభ్యులుగా నియమించింది.