న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్.. స్పెషల్ ఈవెంట్లు, లైవ్ పర్ఫామెన్స్తో ఆడిపాడిన హైదరాబాదీలు

న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్.. స్పెషల్ ఈవెంట్లు, లైవ్ పర్ఫామెన్స్తో ఆడిపాడిన హైదరాబాదీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025 సంవత్సరానికి నగరం ఘనంగా వీడ్కోలు పలికింది. 31 డిసెంబర్​రాత్రి ఉత్సాహంగా గడిపారు. ఐటీ కారిడార్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్, పంజాగుట్ట, అమీర్​పేట్, సికింద్రాబాద్, అబిడ్స్​, ట్యాంక్‌బండ్, ఓయూ క్యాంపస్, మొయినాబాద్​, శంకర్​పల్లి తదితర ప్రాంతాల్లో కొత్త ఏడాదికి గ్రాండ్​గా వెల్​కమ్​చెప్పారు. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులు, ఫామ్​హౌస్​లు, ఈవెంట్స్​ఏరియాల్లో అర్ధరాత్రి వరకు సంబురాలు చేసుకున్నారు. 

బేగంపేట కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో రసూల్‌పూరలోని పోలీస్ హాకీ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో టాలీవుడ్ నేపథ్య గాయకులు పావని, నందకిషోర్ టీమ్​పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. ఇంటర్నేషనల్​డీజేలు వనీష్, ఎక్స్​టసీలు యువతను హుషారెక్కించారు. ఎల్బీనగర్​ జీఎస్​ఆర్​కన్వెన్షన్​లో సింగర్​సునీత, ఆర్పీ పట్నాయక్​ పాటలు ఆకట్టుకున్నాయి. హైటెక్స్​లో రామ్​మిరియాల జోష్​ నింపారు. బిగ్​బుల్​పబ్​లో ఇంటర్నేషన్​ డీజే ఆప్టరాల్​ షో అలరించింది. హాయ్​ల్యాండ్​లో రాహుల్​ సిప్లిగంజ్​లైవ్​మ్యూజికల్​ఫర్మామెన్స్​తో అదరగొట్టారు.  ఓపెన్ గ్రౌండ్స్, కన్వెన్షన్ హోటల్స్ లో, హైటెక్స్ ఎరినా గ్రౌండ్స్ లో భారీ న్యూ ఇయర్ ఈవెంట్స్​జరిగాయి. 

ఫ్లై ఓవర్ల మూసివేత.. డ్రంక్​ అండ్ ​డ్రైవ్​

ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని ఫ్లైఓవర్లను (బేగంపేట్, టోలిచౌకి మినహా) మూసివేశారు. ట్యాంక్‌బండ్ పైకి, నెక్లెస్ రోడ్ లోకి, ఎన్టీఆర్ మార్గ్ లో వాహనాల రాకపోకలను నిషేధించారు. రాత్రి 7 గంటల నుంచే డ్రంక్​అండ్​డ్రైవ్ తనిఖీలు మొదలుపెట్టి ఉదయం 6 గంటల వరకు డ్రంక్​అండ్​డ్రైవ్​తనిఖీలు చేశారు. చాలాచోట్ల రాత్రి 9 గంటల్లోపే ఫుల్లుగా తాగి బండ్లు నడుపుతూ దొరికారు. జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్​వద్ద తనిఖీలు నిర్వహించగా, ఓ ఆటో డ్రైవర్ కు 242 పాయింట్లు వచ్చింది. ఫలక్​నుమాలో నిర్వహించిన తనిఖీల్లో ఓ టూవీలర్​నడిపే వ్యక్తిని తనిఖీ చేయగా 399 పాయింట్లు వచ్చింది. 

వైన్స్​ ఎదుట రద్దీతో ట్రాఫిక్​ జామ్స్​

చాలా చోట్ల వైన్ షాపుల వద్ద క్యూ లైన్లు కనిపించాయి. ఫ్రిజ్​లలో పెట్టిన బీర్లు పెట్టినట్టు ఖాళీ కావడంతో చాలాచోట్ల డ్రంబుల్లో ఐస్​వేసి అందులో బీర్​బాటిల్స్​పెట్టి అమ్మారు. కొన్నిచోట్ల మందు కోసం ఎగబడడంతో రోడ్లపై ట్రాఫిక్​జామ్స్​తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కేఎల్ బార్ అండ్​రెస్టారెంట్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైపు వెళ్లే మెయిన్​రోడ్డు మొత్తం భారీ ట్రాఫిక్ జామ్‌ నెలకొంది.  

బేకరీలు, బిర్యానీ సెంటర్ల వద్ద రద్దీ 

సాయంత్రం నుంచి కేకుల కోసం జనాలు బేకరీలు బాట పట్టారు. ఇయర్​ఎండ్​నేపథ్యంలో చాలా బేకరీలు కిలో కేక్​ను రూ. 200కు ఆఫర్​ప్రకటించడంతో ఎగబడ్డారు. చాలా చోట్ల బేకరీల ఎదుట రోడ్ల పక్కనే వందల కేకులను పెట్టి విక్రయించడం కనిపించింది. అలాగే, రాత్రి బిర్యానీ సెంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. కొన్ని చోట్ల గిగ్​వర్కర్ల సమ్మెతో బిర్యానీ సెంటర్ల ఓనర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యామ్నాయంగా తమ సిబ్బందికి డెలివరీ బాధ్యతలు అప్పగించారు. 

చేవెళ్లలో.. 

చేవెళ్ల నియోజవర్గంలో ఎక్కువగా ఫామ్ హౌస్ లు ఉండటంతో  పట్టణంలో కొత్తం సంవత్సరం కల కనిపించింది.  చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండల పరిధిలోని అనేక  ఫామ్ హౌస్ లు, రిసార్ట్స్ లు ఉండడంతో  టౌన్ లో వైన్ షాపులను అందంగా ముస్తాబు చేశారు.