బుబ్చిబాబు టోర్నీలో‌ హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీ

బుబ్చిబాబు టోర్నీలో‌ హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఆలిండియా బుబ్చిబాబు ఇన్విటేషనల్‌‌ టోర్నమెంట్‌‌లో వరుసగా మూడో విజయంతో హైదరాబాద్ హ్యాట్రిక్ సాధించింది. చెన్నైలో గురువారం ముగిసిన మూడో రౌండ్‌‌ మ్యాచ్‌‌లో ఇన్నింగ్స్ 59 రన్స్ తేడాతో మధ్యప్రదేశ్‌‌ను చిత్తు చేసింది. ఎంపీ టీమ్ తొలి ఇన్నింగ్స్‌‌లో 181 రన్స్‌‌కే ఆలౌట్ అయ్యింది.

ప్రతిగా హైదరాబాద్ 87 ఓవర్లలో 414/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్ చేసి భారీ ఆధిక్యం అందుకుంది. సీనియర్ బ్యాటర్‌‌‌‌ తన్మయ్ అగర్వాల్ (130), వరుణ్ గౌడ్ (100 నాటౌట్) సెంచరీలతో విజృంభించారు. 233 లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌‌కు వచ్చిన ఎంపీ మ్యాచ్ చివరకు 174/2 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది.