
హైదరాబాద్ లో సినిమా థియేటర్లకు హార్ట్ లాంటిది ఆర్టీసీ Xరోడ్స్..సంధ్య, దేవీ, సుదర్శన్, ఓడియన్ వంటి ఐకానిక్ సింగిల్ స్కీన్ థియేటర్లతో హైదరాబాద్ లో సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. ఈ సినిహబ్ దశాబ్దాలుగా లెక్కలేనన్నీ బాక్సాఫీస్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. మూవీ ప్రియులకు ఈ ప్లేస్ చాలా ఇష్టమైంది. ప్రస్తుతం 18 థియేటర్లు సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రెండు మల్టీప్లెక్స్‌లు రాబోతున్నాయి.. అదీ కూడా అక్టోబర్లోనే..
ఓడియన్ మల్టీప్లెక్స్ ప్రారంభం..
ఓడియన్ మల్టీప్లెక్స్.. అక్టోబర్ 24, 2025న ప్రారంభం కానుంది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్‌గా ప్రసిద్ధి చెందిన దీనిని ఇప్పుడు 8-స్క్రీన్ల మల్టీప్లెక్స్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ప్రొజెక్షన్, లగ్జరీ సీటింగ్ ,మల్టీలెవల్ పార్కింగ్‌తో పునర్నిర్మించారు. లోపల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. సినిమాలు, షాపింగ్ రెండింటినీ ఒకే దగ్గర చేసుకోవచ్చు. ఈ కొత్త మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతుందని భావిస్తున్నారు.
AMB క్లాసిక్ త్వరలో ..
ఓడియన్ తర్వాత AMB క్లాసిక్ 2026 సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానుంది. సుదర్శన్ 70MM కాంప్లెక్స్ ఉన్న ప్రదేశంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో 7 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ మల్టీప్లెక్స్ లో తొలి సినిమా ది రాజా సాబ్ అని ప్రదర్శిస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు రెండవ మల్టీప్లెక్స్ వెంచర్‌గా AMB క్లాసిక్ ఇప్పటికే PVR ,INOX వంటి పెద్ద పేర్లతో ఎలా పోటీ పడుతుందనే దానిపై సినీ ప్రేక్షకులలో ఉత్సుకత నెలకొంది.
ఓడియన్ ,AMB క్లాసిక్ తో RTC X రోడ్స్ 18 నుంచి 20 థియేటర్లకు పెరుగుతుంది. ఇది నోస్టాల్జియాతో నిండిన సింగిల్ స్క్రీన్ల నుంచి ఆధునిక మల్టీప్లెక్స్ సంస్కృతికి మారింది. లగ్జరీ ఎక్స్ పీరియెన్స్పై సినీ ప్రేమికులు ఉత్సాహంగా ఉన్నారు.