సికింద్రాబాద్ లో ఆఫీస్ ముందు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసనకు దిగారు. జీతంలో కోత విధిస్తున్నారంటూ ఆందోళకు దిగారు ఉద్యోగులు. రాత్రింబవళ్లు తేడా లేకుండా అన్ని పనులు చేయించుకుని జీతం తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీలోని ఈవిడిఎంలో పనిచేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలో డిఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నారు. 1,100 మంది ఔట్సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా అందేలా జీవో తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 5 వేల రూపాయల జీతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది. సగానికి పైగా సిబ్బందికి ఈ నెల 5 వేల రూపాయలు జీతం తగ్గిందని ఆందోళనకు దిగారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని ... 1272 జిఓ ను సవరణ చేయాలని డిమాండ్ చేశారు సిబ్బంది. లేకపోతే ఈ రోజు నుంచి విధులకు వెళ్లకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది.
►ALSO READ | మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీగా ట్రాన్స్జెండర్లు
వర్షాలకు రోడ్లపై వరద నీటిని క్లియర్ చేసేందుకు డీఆర్ఎఫ్ టీమ్స్,ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేస్తాయి. వరదతో కాలువలు,పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తారు. కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మించిన శాశ్వత దుకాణాలను తొలగించడం కోసం రెండు విభాగాలకు చెందిన టీమ్స్ పనిచేయనున్నాయి.
