
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్‌పేటలోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పర్యటించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పలు పనులను పరిశీలించారు.
దశాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్‌పేట జంక్షన్లో 6 పైపులైన్లు పూడుకుపోవడంతో వరద సాఫీగా సాగలేదన్నారు. ఈ కాలువలో 45 ట్రక్కుల మట్టిని తొలగించినట్లు తెలిపారు. దీంతో ఈ పైపులైన్లు క్లియర్ అయ్యాయని, ఇకపై వరద సమస్య ఉండన్నారు.
మరో 3 లైన్లలో పూడిక తీయడంతో పాటు, ఈ వరదంతా గాయత్రీనగర్పై పడకుండా అక్కడ కూడా పైపులైన్లలో మట్టిని తొలగించాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలానికి గాయత్రీ నగర్ ముంపు లేకుండా చూడాలని సూచించారు.