
హైదరాబాద్ సిటీ, వెలుగు: జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 ప్రాంతాల్లో చెత్త, పూడిక తొలగించినట్లు హైడ్రా అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 15,665 క్యాచ్పిట్లు, 359 కల్వర్టులు, 1,670 నాలాల్లో చెత్త తొలగించగా, 4,609 వాటర్ లాగింగ్ పాయింట్లు క్లియర్ చేసినట్లు తెలిపారు. వర్షాల సమయంలో 4,974 ప్రాంతాల్లో చెత్త, 810 విరిగిన చెట్లను తొలగించామన్నారు. మలక్పేట, డబీర్పురా వద్ద గంగా నగర్ నాలాలో 15 ట్రక్కుల చెత్తను ఒకే రోజు తరలించినట్లు పేర్కొన్నారు.
టౌలీచౌకిలో బుల్కాపూర్ నాలా, గౌరీశంకర్ బస్తీలో నాలాల క్లీనింగ్ దాదాపు పూర్తైందని, పాతబస్తీలోని తలాబ్ చంచలంలో పూడిక తొలగింపు కొనసాగుతోందని వివరించారు. వర్షాల సమయంలో ప్రయాణికులు, నివాసితులకు ఇబ్బందులు లేకుండా హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు.