హైదరాబాద్ సిటీ, వెలుగు: వ్యర్థాలతో నిండిపోయి, వరద ప్రవాహానికి అవకాశం లేకుండా మారిన ఆఘాపురా నాలాను హైడ్రా క్లీన్ చేసింది. మెహిదీపట్నం, విజయనగర్ కాలనీ, ఏసీ గార్డ్స్, మల్లేపల్లి, నాంపల్లి ప్రాంతాల నుంచి వరద నీటిని మూసీ నదికి చేర్చే ఈ నాలా పరుపులు, సోఫాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో పూర్తిగా పేరుకుపోయింది. దారూసలాం కల్వర్టు వద్ద పేరుకుపోయిన ఈ చెత్తకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైడ్రా స్పందించింది.
నాలాలోకి యంత్రాలు దించే పరిస్థితి లేకపోవడంతో, హైడ్రా మెట్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది స్వయంగా రంగంలోకి దిగారు. వారం రోజుల పాటు శ్రమించి 56 ట్రక్కుల పూడికను తొలగించారు. హైడ్రా అధికారులు ఆర్‌ఎఫ్‌ఓ జయప్రకాష్, ఎస్‌ఎఫ్‌ఓ చరణ్ కుమార్ పనులను పర్యవేక్షించారు.
