
హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షం వచ్చిందంటే చాలు.. రోడ్లన్నీ చెరువులన తలపిస్తాయి.. దీంతో ట్రాఫిక్ జామ్ తో జనాలు నరకం చూడాల్సిన పరిస్థితి. నాలాలు నిండిపోయి డ్రైనేజి రోడ్లపై ప్రవహించడమే ఇందుకు ప్రధాన కారణం. చాక్లెట్ పేపర్ దగ్గర నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు,ప్లేట్స్.. ఇలా ఏది పడితే అది రోడ్లపై, నాలాల్లో పడేస్తుంటారు జనం. ఇవన్నీ నాలాల్లో చేరడంతో అవి బ్లాక్ అయ్యి వర్షం పడ్డప్పుడు నాలాలు నిండిపోతుంటాయి.రోడ్లపై చెత్త పడేయద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా జనాల్లో మార్పు రావట్లేదు. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన నాలాలను సాఫ్ చేసేందుకు రంగంలోకి దిగింది హైడ్రా. శుక్రవారం యూసఫ్ గూడ పరిసర ప్రాంతాల్లోని నాలాలు , కల్వర్టుల దగ్గర పూడికతీత పనులు చేపట్టింది హైడ్రా.
ALSO READ | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బైకును 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
వర్షాలు లేని రోజుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కల్వర్టులు, నాలాల పూడికతీత పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో యూసుఫ్ గూడ పరసరాల్లోని మధురా నగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లోని నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు హైడ్రా సిబ్బంది.
నాలాల్లో చెత్త వెలికితీస్తున్న క్రమంలో టన్నుల కొద్దీ బయటపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త బయటపడింది. ఎల్‌బీ నగర్ సర్కిల్ పరిధిలోని మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చెరువు కు వెళ్లే నాలాలో ఉన్న పూడికను కూడా తొలగించారు హైడ్రా సిబ్బంది.
వర్షాకాలం మొదలైన క్రమంలో హైడ్రా నాలాలు సాఫ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ముందుచూపుతో నాలాల పూడికతీత పనులు చేపట్టిన హైడ్రాకు హ్యాట్సాఫ్ అంటున్నారు ప్రజలు.