శభాష్ హైడ్రా.. చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన సిబ్బంది

శభాష్ హైడ్రా.. చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన సిబ్బంది

హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు గురైన భూములు, చెరువులు, కుంటలు, పార్కులను కాపాడటమే కాదు. ఆపదలో ఉన్న వారిని కూడా ఆదుకోవమే లక్ష్యంగా పనిచేస్తోంది హైడ్రా. ఇటీవలి వర్షాలకు హైదరాబాద్ లో సహాయక చర్యలు చేపట్టి నగరవాసులకు అండగా నిలిచింది. శనివారం (సెప్టెంబర్ 06) నగరంలో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని కాపాడీ శాభాష్ అనిపించుకున్నారు హైడ్రా సిబ్బంది. 

నగరం అంతా నిమజ్జనోత్సవాల్లో ఉండగా ఒక వ్యక్తి ఆత్మహ్యకు ప్రయత్నించాడు. కుటుంబ కలహాలతో రహీం అనే వ్యక్తి దుండిగల్ చెరువులో దూకి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సాయంత్రం ఒంటరిగా చెరువు వద్దకు వచ్చి అమాంతం దూకేశాడు. 

►ALSO READ | హైదరాబాద్ లో తెల్లవారుజాము వరకు MMTS రైళ్లు.. గణేష్ నిమజ్జనానికి హ్యాపీగా వెళ్లి రండి..

అదే సమయంలో దుండిగల్ చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న హైడ్రా DRF సిబ్బంది.. వ్యక్తి చెరువులోకి దూకడం గనమించారు. వెంటనే అక్కడికి చేరుకుని చెరువులో నుంచి వ్యక్తిని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో రహీంను పోలీసులకు అప్పగించారు హైడ్రా సిబ్బంది. వ్యక్తి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందిని అక్కడున్న వారు మెచ్చుకున్నారు.