
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. శనివారం ( సెప్టెంబర్ 6 ) రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ( సెప్టెంబర్ 7 ) తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేకంగా MMTS రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. నిమజ్జనానికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సంస్థ.
సికింద్రాబాద్-హైదరాబాద్, లింగంపల్లి-హైదరాబాద్, ఫలక్ నుమా-హైదరాబాద్ మధ్య రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.
►ALSO READ | బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి.. భక్తుల కోళాహలం నడుమ శోభాయాత్ర సాగిందిలా
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం ఒంటి గంట వరకు నాన్ స్టాప్ గా సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. శనివారం ఉదయం నుంచి సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు నాన్ స్టాప్ గా మెట్రో రైళ్లు నడపనున్నట్లు తెలిపింది హైదరాబాద్ మెట్రో.అన్ని రైల్వే స్టేషన్లలో లాస్ట్ రైలు సర్వీసు సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు ఉంటుంది.
సిటీలోని ఆయా ప్రాంతాల్లో జరిగే గణేష్ శోభాయాత్రను తిలకించాలనుకునే భక్తులకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి... హ్యాపీ జర్నీ..