
హైదరాబాద్ లో పాతబస్తీ ఏరియాలోని కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. శుక్రవారం (అక్టోబర్ 17) ఉదయం గోషామహల్ నియోజవకర్గంలో అక్రమ కట్టడాలను కూల్చి వేసింది. దాదాపు110 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.
నియోజకవర్గంలోని కుల్సుంపురాలో కబ్జాలను తొలగించారు హైడ్రా అధికారులు. కబ్జాకు గురైన ఎకరం 30 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో పేదలకు ఇండ్లు కట్టించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీంతో కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా.
అశోక్ సింగ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా.. అందులో షెడ్లు వేశాడు. విగ్రహతయారీదారులకు అద్దెకు ఇస్తూ వస్తున్నాడు. శుక్రవారం హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేసి భూమిని స్వాధీనం చేసుకుంది.