డిప్యూటీ సీఎంను కలిసిన హైమన్ డార్ఫ్ అసోసియేషన్

డిప్యూటీ సీఎంను కలిసిన హైమన్ డార్ఫ్ అసోసియేషన్

జైనూర్, వెలుగు: ఆదివాసీ ఆరాధ్యుడు హైమన్ డార్ఫ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని మంగళవారం హైమన్ డార్ఫ్ అసోసియేషన్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత గుస్సాడి కనక రాజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆహ్వానించారు. హైదరాబాద్​లోని సెక్రటేరియట్​లో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో  కలిసి వర్ధంతికి సంబంధించిన వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ కనక వేంకటేశ్వర్ మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి కృషి చేసిన హైమాన్ డార్ఫ్ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా జరపాలని మంత్రి సీతక్కకు విన్నవించారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెంకటేశ్వర్లు తెలుపారు. గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ, అసోసియేషన్ సభ్యులు ఆత్రం మాణిక్ రావు, గెడ్డం గణపత్ రావు, కనక భారత్, జూగ్నక్ దేవురావు తదితరులున్నారు.