ఉస్మానియా వర్సిటీకి ఉత్తమ ర్యాంక్ రావటం సంతోషాన్నిచ్చింది

ఉస్మానియా వర్సిటీకి ఉత్తమ ర్యాంక్ రావటం సంతోషాన్నిచ్చింది

ఓయూ, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే ప్రతిభావంతులైన స్టూడెంట్లు బయటకు వస్తున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.  ఉస్మానియా వర్సిటీలో చదివిన వారిలో ఓ ప్రధానితో సహా ఎంతో మంది సీఎంలు, ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు.  మంగళవారం ఆయన ఓయూను విజిట్​ చేశారు. ఈ సందర్భంగా  ఓయూలో జరుగుతున్న పరిశోధనలు, విద్యాపరమైన విషయాలపై ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దత్తాత్రేయకు వివరించారు.  ఎన్ఐఆర్ఎఫ్​లో ఉస్మానియా వర్సిటీకి ఉత్తమ ర్యాంక్ రావటం సంతోషాన్నిచ్చిందని  దత్తాత్రేయ చెప్పారు.  ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి నిధుల కేటాయింపు  కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.  దత్తాత్రేయ వెంట వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్  ఉన్నారు.