
TRS ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను కవితా విభాగంలో ఆయన అవార్డు అందుకోబోతున్నారు. అలాగే.. బాలసాహిత్య విభాగంలో ‘నేను అంటే ఎవరు’ అనే నాటక రచనకుగాను దేవరాజుకు అవార్డు వరించింది. యువసాహిత్య పురస్కారం కింద.. ‘దండ కడియం’ సాహిత్యానికి గాను తగుల్ల గోపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు గెలుచుకున్న గోరటి వెంకన్న, దేవరాజు, తగుల్ల గోపాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక.. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉన్నారు గోరటి వెంకన్న. వాగ్గేయ కుటుంబం నుంచి రావడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. తాను ప్రతీది అనుభవపూర్వకంగానే రాశానని చెప్పారు.