సాగర్​ నుంచి పోటీ చేయడం లేదు

సాగర్​ నుంచి పోటీ చేయడం లేదు
  • రాష్ట్రంలో టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనే: రాజగోపాల్​రెడ్డి

చౌటుప్పల్, వెలుగు: త్వరలో జరగనున్న నాగార్జునసాగర్​ బైఎలక్షన్​లో తాను బీజేపీ తరఫున పోటీ చేయడం లేదని, అలాంటి ఆలోచనేదీ లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన చౌటుప్పల్​లో మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో.. ఎమ్మెల్సీ పదవి మూడేండ్లు ఉండగానే రాజీనామా చేసి పోటీ చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్​ రెండు సార్లు అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యేలు పార్టీ మారడం, పార్టీ హైకమాండ్​ తగిన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటివాటితోనే తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం జరిగిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, ఆ పార్టీని ఓడించడం బీజేపీతోనే సాధ్యమని చెప్పానని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున సాగర్​లో పోటీ చేయాలనే ఉద్దేశమేదీ లేదన్నారు. అసలు మీడియాలో ఆ వార్తలను చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు.

ఇవి కూడా చదవండి 

వామన్​రావును చంపేందుకు 10 నెలల కిందే ప్లాన్

లాయ‌ర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వ‌ర‌కు లాక్కెళ్లింది

మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్

పతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO