ఆయుష్ రంగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే తొలిసారి

ఆయుష్ రంగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే తొలిసారి

గాంధీ జన్మస్థలానికి రావడం సంతోషంగా ఉందన్నారు ఆరోగ్య సంస్థ అదినేత టెడ్రస్ అథనామ్. గుజరాత్ గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ ఇన్నోవేషన్ సదస్సు ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రస్ అథనామ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఆయుష్ రంగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే తొలిసారన్నారు ప్రధాని మోడీ. మెడికల్ ప్లాంట్ల అమ్మకాల కోసం మార్కెట్లతో రైతులు ఈజీగా కనెక్ట్ య్యేందుకు ఆయుష్ ఈ-మార్కెట్ ప్లేస్ ఆధునికీకరణ, విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు మోడీ. కొవిడ్ టైమ్ లో ఆయుర్వేద మెడిసిన్ పంపిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు మారిషస్ ప్రధాని.  భారత్ ఫార్మీసీ హబ్ అని అన్నారు మారిషస్ ప్రధాని.