సవాల్ విసిరాడు.. సరౌండ్ చేశారు.. ఇమ్మడి రవితోనే ఐ బొమ్మను మూసివేయించిన పోలీసులు !

సవాల్ విసిరాడు.. సరౌండ్ చేశారు.. ఇమ్మడి రవితోనే ఐ బొమ్మను   మూసివేయించిన పోలీసులు !
  • దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరిన నిర్వాహకుడు
  • 2 నెలలుగా నిఘా వేసి అరెస్ట్.. వరల్డ్ వైడ్​గా హ్యాకింగ్ నెట్​వర్క్
  • యూకే నుంచి సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు డౌన్​లోడ్
  • వెబ్​సైట్ లాగిన్ వివరాలు పోలీసులకు అందజేత

హైదరాబాద్​ సిటీ, వెలుగు: పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన ఐబొమ్మ వెబ్​సైట్​ను సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులు మూసివేయించారు. లాగిన్స్‌‌‌‌, సర్వర్‌‌‌‌ వివరాలతో వెబ్​సైట్ మేనేజర్ ఇమ్మడి రవితోనే వాటిని క్లోజ్‌‌‌‌ చేయించారు. రవి అరెస్ట్​తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేలాది సినిమాలను హార్డ్ డిస్క్‌‌‌‌లలో స్టోర్ చేసి వరల్డ్ వైడ్​గా హ్యాకింగ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది. 

గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీలకు రవి సీఈవోగా ఉన్నాడు. తన టీమ్​తో కలిసి యూకే నుంచి సర్వర్లను హ్యాక్ చేస్తూ వేలాది సినిమాలను డౌన్​లోడ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. కాగా, ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం కాగా.. అతడు ముంబైలో ఎంబీఏ పూర్తి చేసినట్లు విచారణలో వెల్లడైంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న రవి.. కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు. 2018 నుంచి హైదరాబాద్ కూకట్​పల్లిలోని రెయిన్ బో విస్టా అపార్ట్​మెంట్​లో ఉంటున్నాడు. ఏం వర్క్ చేస్తావని పక్కనోళ్లు అడిగితే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పుకునేవాడు. 

దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్

సినిమాల పైరసీపై సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిల్మ్ చాంబర్స్ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పైరసీ నెట్​వర్క్​పై నిఘా పెట్టారు. బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని 2 నెలల కింద పోలీసులు ప్రకటించారు. దీంతో పోలీసులకు ఇమ్మడి రవి సవాల్ విసిరారు. ‘‘మీరు నా మీద ఫోకస్​ చేస్తే.. నేను మీ మీద ఫోకస్​చేస్తా. మీకు దమ్మంటే పట్టుకోండి. నేను ఒక్కడిని కాదు.. నాది గ్లోబల్ నెట్ వర్క్. మీ యాక్షన్​కు నా రియాక్షన్  ఉంటది’’అని హెచ్చరించాడు. అలా వార్నింగ్ ఇచ్చిన నెల రోజుల్లోనే పోలీసులు రవిని పట్టుకున్నారు.

సైబర్ క్రైమ్ డీసీపీని అభినందించిన సీవీ ఆనంద్

సైబర్ క్రైమ్ డీసీపీ కవిత, టీమ్​ను హైదరాబాద్ సిటీ పూర్వ సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. ‘ఈ అరెస్ట్ హై-లెవెల్ మూవీ పైరసీ కేసుకు సంబంధించింది. డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి సినిమాల రిలీజ్ కంటే ముందే వాటిని తమ వెబ్‌‌‌‌సైట్లలో అప్​లోడ్ చేశారు. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లాయి. సైబర్ క్రైమ్ టీమ్ జూన్ 5 నుంచి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసింది. కీలక వ్యక్తులను అప్పుడే అరెస్ట్ చేసింది. తాజాగా ఫారిన్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూడా అరెస్ట్ చేసింది’’అని సీవీ ఆనంద్​ ట్వీట్ చేశారు.