ఆర్టీసీలో సంక్షోభం వచ్చినప్పుడు పోలీసుల సేవలు

ఆర్టీసీలో సంక్షోభం వచ్చినప్పుడు పోలీసుల సేవలు

ఆర్టీసీలో సంక్షోభం వచ్చినప్పుడు పోలీసుల సేవలు వాడుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తాను రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఆర్టీసీ 13 కోట్ల నష్టంలో ఉందని చెప్పారు. అయితే దానిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేసి లాభాల్లోకి తెచ్చామన్నారు. 13 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 14 కోట్ల లాభాల్లోకి తెచ్చినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత వచ్చిన వాళ్లు మళ్లీ నష్టాల్లోకి తీసుకెళ్లారని వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. చిత్తశుద్ధి, వాక్ శుద్ధి, సందర్భశుద్ధి ఉంటే చేరుకోవాల్సిన గమ్యం తప్పక చేరుకుంటామని చెప్పారు.

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రం అశాంతికి లోనుకాకుండా శాంతిభద్రతల నిలయంగా ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో చాలా నేరాలు తగ్గాయని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సపోర్ట్తో పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తారని  ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం వుందని చెప్పారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ తో  పాటు రాష్ట్రంలో సంస్కారవంతమైన పోలీసింగ్ రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పోలీసులకు ఎటువంటి సహకారం కావాలన్న అందిస్తానని వెల్లడించారు.