భర్తకు దూరం కాలేదు.. కావాల్సి వచ్చింది

భర్తకు దూరం కాలేదు.. కావాల్సి వచ్చింది

బాలీవుడ్​ అందాల తార హేమామాలిని(Hema Malini)  తన వైవాహిక జీవితంపై స్పందించారు. ఏ మహిళ కూడా పెళ్లి చేసుకున్న వ్యక్తికి దూరం కావాలని అనుకోదని అన్నారు. ధర్మేంద్రతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న తాను కొన్ని కారణాల వల్ల అతనికి దూరం కావలసి వచ్చిందన్నారు. 

తానెప్పుడు సాధారణ స్త్రీలానే భర్త, పిల్లలతో సంతోషకర జీవితాన్ని ఊహించుకున్నట్టు తెలిపారు. ఇద్దరిలోనూ వేరుగా ఉంటున్న బాధ లేదని చెప్పింది. పిల్లల పెళ్లిళ్ల గురించే తామిద్దరం దిగులు చెందుతుంటామని తెలిపింది. 

1980ల్లో స్టార్​డంను చూస్తున్న సమయంలోనే ధర్మేంద్రను ఈ నటి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సినిమాల్లోకి రాకముందే ఈ సీనియర్​ నటుడికి ప్రకాశ్​ కౌర్​తో పెళ్లైంది. వీరికి సన్నీడియోల్​, బాబీడియోల్​తో పాటు మరో ఇద్దరమ్మాయిలు జన్మించారు.