Gautam Gambhir: నాకు డేటాపై నమ్మకం లేదు.. గంభీర్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు

Gautam Gambhir: నాకు డేటాపై నమ్మకం లేదు.. గంభీర్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు

Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో క్రికెట్‌లో డేటా అనలిటిక్స్ పాత్రపై అడిగిన ప్రశ్నకు అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు డేటాపై అసలు నమ్మకం లేదు.. నిజంగా చెప్పాలంటే డేటా అంటే ఏమిటో కూడా తెలియదని పేర్కొన్నాడు. టీ20 క్రికెట్ పూర్తిగా ఇన్‌స్టింక్ట్‌పై ఆధారపడి ఉంటుంది.. ఆటపై నాకు ఉన్న అవగాహనను కెప్టెన్‌కు చెప్పి సహాయం చేస్తాను.. కానీ చివరి నిర్ణయం మాత్రం కెప్టెన్‌దేనని గంభీర్ వ్యాఖ్యానించారు.

కాగా గంభీర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆధునిక టీ20 క్రికెట్‌లో డేటా, గణాంకాలు, మ్యాచ్-అప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని క్రికెట్ అభిమానులు గుర్తు చేశారు. ముఖ్యంగా సూపర్–8 దశలో దక్షిణాఫ్రికా ఎడమచేతి బ్యాటర్లకు వ్యతిరేకంగా నెగిటివ్ మ్యాచ్-అప్స్ కారణంగా అక్షర్ పటేల్‌ను బెంచ్‌పై ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తూ, “డేటాపై నమ్మకం లేకపోతే ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు? అంటూ ప్రశ్నించారు. ఇంకా కొందరు అభిమానులు, టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓడిపోతే దీర్ఘకాలంలో జట్టుకు మేలు జరిగే అవకాశం ఉందని, కోచ్‌గా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.  

►ALSO READ | T20 World Cup Clash: 39 ఏళ్ల తర్వాత వాంఖెడేలో భారత్– ఇంగ్లాండ్ మ్యాచ్.. అప్పుడు ఏ జట్టు గెలిచిందంటే?

సోషల్ మీడియాలో మరో వర్గం మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయానికి మద్దతు తెలియజేస్తుంది. కేవలం డేటాపైనే ఆధారపడటం సరైన పద్ధతి కాదని, అనుభవం, ఇన్‌స్టింక్ట్ కూడా ముఖ్యమని పేర్కొంటున్నారు. డేటా అండ్ ఇన్‌స్టింక్ట్ మధ్య సమతుల్య ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా 2024లో ఐపీఎల్ సందర్భంగా కేకేఆర్ జట్టుతో పని చేసిన సమయంలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం గురించి ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.