నేను మొగోన్ని..ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌పై పోటీ చెయ్య: రాజనాల శ్రీహరి

నేను మొగోన్ని..ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌పై పోటీ చెయ్య: రాజనాల శ్రీహరి

వరంగల్​సిటీ, వెలుగు: ‘‘నేను మొగోడిని.. ఒక ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌పై పోటీ చెయ్య.. అందుకే నామినేషన్​ విత్​డ్రా చేసుకుంటున్న..” అంటూ బీఆర్ఎస్​ సీనియర్​నేత రాజనాల శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్​ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్​ రెబల్​ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీహరి.. బుధవారం తన నామినేషన్ ను విత్​డ్రా చేసుకున్నారు. అనంతరం ఆయన వరంగల్​ కార్పొరేషన్​ కార్యాలయం ఆవరణలోని మీడియా పాయింట్​ వద్ద మాట్లాడారు.

డబ్బులకు ఆశపడి నామినేషన్​ విత్​డ్రా చేసుకోలేదని, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌పై పోటీ చేయలేక విరమించుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, సిట్టింగ్​ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్​ఎస్​అభ్యర్థి నరేందర్​ భూకబ్జాదారుడని, రౌడీ, దొంగ అంటూ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వనని, బీఆర్ఎస్​ అభ్యర్థి నరేందర్​ఓటమి కోసం పోరాడుతానని శ్రీహరి చెప్పారు. 

శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలె : బీఎస్పీ అభ్యర్థి పుష్పిత లయట్రాన్స్​జెండర్లపై అనుచిత వాఖ్యలు చేసిన రాజనాల శ్రీహరిని బీఆర్ఎస్​పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని వరంగల్​ తూర్పు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రపు పుష్పిత లయ డిమాండ్​ చేశారు. శ్రీహరిని సస్పెండ్​ చేయకుంటే కేసీఆర్, కేటీఆర్​ ఆదేశాల మేరకే ఆయన ఇలా మాట్లాడినట్లు భావించాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్​జెండర్లు ఏకతాటిపైకి వచ్చి శ్రీహరి ఇంటిని ముట్టడిస్తామని, బీఆర్ఎస్​ను ఓడిస్తామని ఆమె హెచ్చరించారు.