నేను జట్టు కోసం కాదు.. దేశం కోసం ఆడతాను : రోహిత్

నేను జట్టు కోసం కాదు.. దేశం కోసం ఆడతాను : రోహిత్

భారత క్రికెట్ టీమ్ లో టాప్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయంటూ అంతటా చర్చ జరుగుతోంది. వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తో సెమీస్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటినుంచి కోహ్లీ- రోహిత్ మధ్య విభేదాలు మొదలయ్యాయని వార్తలు గుప్పుమన్నాయి. వెస్టిండీస్ టూర్ కోసం వెళ్తూ… మంగళవారం నాడు వీడ్కోలు ప్రెస్ మీట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కూడా ఈ వార్తలపై స్పందించారు. ఐతే.. తమ మధ్య విభేదాలు లేవనీ.. అవన్నీ అబద్దాలే అని కొట్టిపారేశారు.

కోహ్లీ స్పందనపై అంతటా చర్చ జరుగుతోంది. బుధవారం రోజున రోహిత్ శర్మ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. “నేను కేవలం జట్టు కోసం మాత్రమే బ్యాటింగ్ కు దిగను. దేశంకోసం మైదానంలో అడుగుపెడతాను” అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. క్రౌడ్ మధ్య గ్రౌండ్ లోకి దిగుతున్న ఫొటోను రోహిత్ శర్మ పోస్ట్ చేశాడు. రోహిత్ శర్మ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆగస్ట్ 3 నుంచి ఇండియా- వెస్టిండీస్ మధ్య 3 టీట్వంటీలు, 3 వన్డేలు, 2 టెస్టుల సమరం మొదలవుతుంది. ఈ పర్యటనలో 3 ఫార్మాట్లలోనూ ఇండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటారు.