కృష్ణయ్య హత్య కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు

కృష్ణయ్య హత్య కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు

మునుగోడులో సీపీఎం పోటీచేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. మునుగోడు మద్దతు అంశంపై త్వరలో మీడియా సమావేశం నిర్వహించి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పొరడతామని వీరభద్రం చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యపై  తమ్మినేని స్పందించారు. కృష్ణయ్య హత్య విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ హత్యను తాను ఖండిస్తున్నానని వ్యాఖ్యానించారు. 

యాదాద్రి జిల్లాలో 160 చెరువులు మూసీ ద్వారా నిండుతున్నాయని తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఐదు కాలువల ద్వారా మూసీ పారుతుందన్న ఆయన... మూసీ పరివాహక ప్రాంతం విషప్రాంతంగా తయారైందని తెలిపారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెల్లారిపల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తమ్మినేని కృష్ణయ్య ... ఆ తర్వాత కౌటాలపల్లి గ్రామానికి వస్తుంటే.. దుండగులు ఆటోను రోడ్డుపై అడ్డంగా నిలిపి అటకాయించారు. ఆ తర్వాత కృష్ణయ్యపై బండరాళ్లు, కత్తులతో దాడి చేసినట్టు సమాచారం.