మీ సమస్యలు నాకు తెలుసు.. నా అనుభవం చూసి ఓటెయ్యండి

మీ సమస్యలు నాకు తెలుసు.. నా అనుభవం చూసి ఓటెయ్యండి
  • కేబీఆర్ పార్క్ లో టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి ప్రచారం

హైదరాబాద్: పట్టభద్రుల సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది.. మీ సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.. నా అనుభవం చూసి నాకు ఓటు వేయండి.. అంటూ టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె ఇవాళ సోమవారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,  డివిజన్ కార్పొరేటర్లతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్కులో వాకింగ్ వచ్చిన సినీ నిర్మాత దిల్ రాజు తదితరులతో పాటు వాకర్స్ తో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా రంగంలో నాకున్న అనుభవాన్ని  నాకు ఓటు వేయాలని… శాసనమండలిలో పట్టభద్రుల సమస్యలు వినిపిస్తానని చెప్పారు. పట్టభద్దుల సమస్యల  పై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. జేఎన్టీయూలో చదివి..ఐదేళ్లు అక్కడే అధ్యాపకురాలిగా పనిచేశానని గుర్తు చేశారు. గత 31 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉంటున్నానని.. విద్యారంగానికి సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఉందన్నారు. ఒక్క సారి అవకాశం ఇచ్చిచూడాలాని పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు టూర్‌లో హైటెన్షన్.. రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధం

బీజేపీ పాలనలో కొందరే రిచ్ అవుతున్నరు

ప్రధాని మోడీ పాలన బ్రిటీషోళ్ల కన్నా ఘోరం!

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?