హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన చిత్రం ‘దీవాన’. జూన్ 19న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ కంపోజ్ చేయడంతోపాటు లిరిక్స్ రాసి, తానే స్వయంగా పాడాడు.
‘తెల్లపోరి, నా తెల్లపోరి, ఐ లవ్ మై తెల్లపోరి, క్యూట్ పోరి.. అట్లెట్ల పుట్టినావే.. గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది.. ఆమె కోడలైతే.. మా మమ్మీడాడీ లక్కే, దేవతే బిడ్డగా ఇంటికొచ్చినట్టే, ఆమె వదినైతే నా దోస్తుగాళ్లు బుక్కే..’ అంటూ ఫన్నీగా సాగుతుందీ పాట. ఇందులో హీరో హీరోయిన్స్ హర్షిత్, స్నేహ లుక్స్ ఫ్రెష్ ఫీల్‌నిస్తున్నాయి. యూత్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉందని మేకర్స్ తెలియజేశారు.
