నేను రెమ్యునరేషన్ కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు : సమంత

నేను రెమ్యునరేషన్ కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు : సమంత

హీరోయిన్ల పారితోషికాలపై సినీ నటి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండని అడుక్కునే పరిస్థితుల్లో తాను లేనని స్పష్టం చేశారు. మన కష్టం చూసి వాళ్లే ఇంత ఇవ్వాలని చెప్పాలన్నారు. మనం చేసే కృషి, పట్టుదల ఆధారంగానే అది వస్తుందని నమ్ముతానన్న సమంత.. శక్తి, సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే ఆమె తన ఆరోగ్యంపైనా స్పందించారు. జీవితంలో ఏ రోజు ఒకేలా ఉండదని.. ప్రతి రోజు భిన్నంగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. తాను అనారోగ్యం బారిన పడ్డానని తెలిసి, దర్శక నిర్మాతలు వెయిట్ చేశారన్నారు. అందుకు తాను వాళ్లకు కృతజ్ఞురాలినై ఉంటానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. వాళ్లు ఇచ్చిన ధైర్యమే తనను మళ్లీ సెట్ లోకి వచ్చేలా చేసిందన్నారు.

డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న శాకుంతలం సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య పట్టుబట్టి సమంత ఈ సినిమాను కంప్లీంట్ చేశారు. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా, ఆస్పత్రిలో ఉండి కూడా డబ్బింగ్ చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంత కష్టపడిన శాకుంతలం మూవీకి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.