పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతా

పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతా

 ‘‘నెలరోజుల క్రితమే సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. నాకింకా పెళ్లి కాలేదు, సరైన జాబ్ లేదు, పొట్ట వస్తోంది, జుట్టు ఊడుతోంది లాంటి ఇన్‌‌సెక్యూరిటీస్‌‌, ఇన్‌‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌‌తో ఉండే యూత్‌‌కి కనెక్టయ్యే సినిమా.  మొదట ఈ సినిమా చేయకూడదని తప్పించుకుని తిరిగా. కానీ కథ మొత్తం విన్నాక కచ్చితంగా చేయాలని ఫిక్సయ్యా. నడక మొదలు బాడీ లాంగ్వేజ్ వరకూ ప్రతిదీ  కేర్ తీసుకుని చేశా. పది కిలోలు పెరగమన్నారు. తర్వాత తగ్గాలంటే కష్టమని ఏడు కిలోలకి ఆపేశా. నా ఫస్ట్ మూవీ ‘వెళ్లిపోమాకే’కి చాలా వర్క్ షాప్స్​ చేశాం. అది దీనికి హెల్పయింది. అయితే ఎక్కువ మేజిక్ రైటింగ్‌‌లోనే ఉంది. ఇలాంటి సినిమా చూసి పదేళ్లవుతోంది. ఈ జానరే చేయాలి అని నేనెప్పుడూ గిరి గీసుకోలేదు. ఫిమేల్‌‌ రోల్‌‌లో  నటించేందుకు కూడా రెడీ. అలాగే పాత్రలకి సంబంధించి రిఫరెన్సులు తీసుకోను. ఆ క్యారెక్టర్‌‌‌‌ను నేనయితే ఎలా చేస్తాననేది హోమ్ వర్క్ చేసుకుంటాను. ఇప్పటి వరకు నేను చేసినవి ఒకెత్తు, ఇకపై చేయబోయేవి మరొకెత్తు. నాకు తెలంగాణ లేదా తెలుగు హీరోగానే ఉండిపోవాలని లేదు. అన్ని ప్రాంతాల్లో మెప్పించాలని ఉంది. మరో రెండేళ్లలో హైదరాబాద్‌‌ని రిప్రజెంట్ చేస్తూ ముంబైలో ఉండాలి. ‘ఫలక్‌‌నుమా దాస్‌‌’ సీక్వెల్ ‘మాస్‌‌ కా దాస్‌‌’ని ప్యాన్ ఇండియా మూవీగా తీయబోతున్నా. నెక్స్ట్ ఇయర్ నా బర్త్ డేకి అనౌన్స్ చేసి, ఇయర్ ఎండింగ్‌‌కి షూట్‌‌ స్టార్ట్ చేస్తాం. నేనే డైరెక్ట్ చేస్తాను. ‘ఓరి దేవుడా’ రిలీజ్‌‌కి రెడీ. ‘ధమ్కీ’ షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 13 నుంచి మూడో షెడ్యూల్. సబ్జెక్ట్‌‌లో నా నుంచి ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. నరేష్​ని డైరెక్టర్‌‌‌‌గా ఉంచి నేను మార్పులు చేస్తే ఇంటర్‌‌‌‌ఫియరెన్స్‌‌లా ఉంటుంది. అందుకే నేనే డైరెక్ట్ చేస్తానన్నాను. సరే అన్నాడు. యాక్షన్ కామెడీ డ్రామా.  మా బ్యానర్‌‌‌‌లోనే ‘స్టూడెంట్‌‌ జిందాబాద్’ అనే మరో సినిమా ఉంది. ‘సవారి’ ఫేమ్ సాహిత్ దర్శకుడు. ‘పాగల్‌‌’ నుంచి నన్ను ఎన్టీఆర్‌‌‌‌తో కంపేర్ చేస్తున్నారు. దాన్ని కాంప్లిమెంట్‌‌లా తీసుకుంటా. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్‌‌ని. అయితే నాకంటూ సొంత ఐడెంటిటీ తెచ్చుకునేందుకే ప్రయత్నిస్తాను. మూడు రోజులుగా ప్రాంక్‌‌ వీడియో విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీ.. నా వెనుక ఎంతమంది ఉన్నారనేది నాకు గుర్తు చేసింది. నాకు ప్రేక్షకుల అండ ఉందనే ధైర్యాన్నిచ్చింది. అందుకే దీన్ని మంచి విషయంగానే భావిస్తాను.’’