టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెండితెరపై తక్కువ సినిమాలే చేసినా, పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి', 'జానీ' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. లేటెస్ట్ గా వి6 న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు , ఎదుర్కొన్న కష్టాలపై ఓపెన్ గా మాట్లాడారు. గ్లామర్ ప్రపంచంలో మెరిసే తారల వెనుక ఎంతటి వేదన ఉంటుందో రేణు తన మాటలతో వివరించారు.
మృత్యువు అంచు దాకా వెళ్లొచ్చా..
రేణు దేశాయ్ తన జీవితంలో ఎదురైన అత్యంత భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. అపెండిసైటిస్ సమస్యతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రక్తం విషపూరితం కావడంకు దారితీసి ప్రాణాపాయం సంభవించేదని వైద్యులు చెప్పినప్పుడు ఆమె షాక్‌కు గురయ్యారట. కేవలం కొన్ని గంటల వ్యవధిలో శస్త్రచికిత్స జరగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అంతే కాకుండా..ఇవి ప్రాణాన్ని కాపాడినా, మెటబాలిజాన్ని దెబ్బతీసి ఆమె శరీరాన్ని ఉబ్బిపోయేలా చేశాయి.
సోషల్ మీడియాలో తన రూపంపై వచ్చిన విమర్శల వెనుక ఇంతటి బాధాకరమైన కారణం ఉందని ఆమె వెల్లడించారు. ఆ సమయంలో బరువు పెరిగినందుకు నెటిజన్ల నుండి ఎదురైన విమర్శలకు మానసికంగా కృంగదీశాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం సహజ వైద్య విధానాల ద్వారా కోలుకుంటూ, ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు..
బాధాకరమైన నిర్ణయమే అయినా..
విడాకుల తర్వాత ఎదురైన సామాజిక విమర్శలను రేణు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకోవడం బాధాకరమైన నిర్ణయమే అయినా, అది తప్పలేదని ఆమె స్పష్టం చేశారు. సమాజం ఏమనుకుంటుందో అని కాకుండా, మహిళలు తమ సొంత సంతోషం కోసం నిర్ణయాలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తల్లిగా తన బాధ్యతను అత్యున్నతంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. అకీరా నందన్, ఆద్యల స్వేచ్ఛకు తాను ప్రాధాన్యతనిస్తానని, అకీరాకు సంగీతం, మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువని చెప్పారు.
►ALSO READ | VARANASI: ప్రపంచాన్ని టార్గెట్ చేసిన ‘వారణాసి’.. మెక్సికో ఈవెంట్‌లో జక్కన్న వీడియో సెన్సేషన్
భవిష్యత్ కలలు..
చిన్నప్పుడు టాపర్ స్టూడెంట్ అయిన రేణు, న్యూరో సర్జన్ కావాలని కలలుగన్నారు. కానీ అనుకోకుండా మోడలింగ్, సినిమా రంగాల్లోకి వచ్చానని చెప్పారు. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టి మళ్ళీ దర్శకత్వం చేయాలనే పట్టుదలతో ఉన్నానని తెలిపారు. సైబర్ బుల్లీయింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు, వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాలన్నదే తన అంతిమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుత కాలంలో విడాకులు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఒకవేళ అవకాశం ఉంటే తాను 'అరేంజ్డ్ మ్యారేజ్'కే ఓటు వేస్తానని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

