మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’ (VARANASI). గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లోబల్ ప్రెజెంటేషన్‌ను మెక్సికోలో నిర్వహించి ‘టాక్ ఆఫ్ ది వారణాసి’గా మార్చారు.
ఏప్రిల్ 24న మెక్సికోలో జరిగిన ప్రతిష్టాత్మక Comic-Con Experience (CCXP–2026) ఈవెంట్‌లో ‘వారణాసి’ చిత్రం కోసం ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కుమారుడు, సహ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ప్రేక్షకులతో మూవీ మేకింగ్ విశేషాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ ఫుటేజ్‌ను ప్రదర్శించడంతో పాటు, ‘వారణాసి’ ప్రివ్యూ వీడియోను కూడా ప్రదర్శించారు. అలాగే, రాజమౌళి వీడియో సందేశం ద్వారా సినిమా నిర్మాణానికి సంబంధించిన ముఖ్యాంశాలను వెల్లడించారు. ఈ ప్రదర్శనతో ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో భారీ చర్చ మొదలైంది.
రాజమౌళి మాట్లాడుతూ..
దర్శకు ధీరుడు జక్కన్న మెక్సికోలో జరిగిన ఈవెంట్లో మాట్లాడి హైలెట్ అయ్యారు. ‘వారణాసి’ టీషర్ట్‌తో కనిపించిన ఆయన, భారతీయ సంస్కృతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలన్న తన లక్ష్యాన్ని చూపించారు. ‘‘మాయ నాగరికత నన్నెంతో ఆకట్టుకుంటుంది. ‘బాహుబలి’ సెట్‌కు చిచెన్ ఇట్జా (Chichen Itza) స్ఫూర్తి. (అతిపెద్ద కట్టడాలలో ఒకటి) అని జక్కన్న తెలిపారు.
►ALSO READ | రగిలిన ఠాగూర్ రీమేక్ రైట్స్ రచ్చ: ముందే అడ్వాన్స్ ఇచ్చా.. చిరంజీవి కోసం పట్టుకెళ్ళిపోయారు.. రాజశేఖర్ కామెంట్స్
అలాగే తన సినీ ప్రయాణంపై భావోద్వేగంగా స్పందించిన ఆయన, ‘‘25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాను. కానీ మన సినిమా సముద్రాలను దాటి, వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు కలిగే ఆనందం వర్ణించలేనిది. RRR తో నాకు అదే అనుభూతి వచ్చింది. ‘నాటు నాటు’ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డ్యాన్స్ చేయడం చూసినప్పుడు, నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో అర్థమైంది’’ అని చెప్పారు.
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
— REFORMA (@Reforma) April 25, 2026
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX
రాజమౌళి చెప్పుకొచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమాను తీసుకెళ్లాలన్న సంకల్పాన్ని మరోసారి చాటి చెబుతున్నాయి.
వారణాసి షూటింగ్ అప్డేట్..
ఓ వైపు శరవేగంగా షూటింగ్ చేస్తూనే, మరోవైపు ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన జక్కన్నను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేయగా, ప్రస్తుతం అంటార్కిటికాలో ఓ యాక్షన్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
#SSKarthikeya lights up the Thunder Stage at #CCXPMexico, unveiling the world of #Varanasi 🔥@urstrulyMahesh#Varanasi #MaheshBabu #PrithvirajSukumaran #PriyankaChopra pic.twitter.com/Ytm0mc1JIy
— Indian Clicks (@IndianClicks) April 25, 2026
గ్లోబల్ ట్రాటర్ పేరుతో ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు, సంచారి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.

