మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 'ఖైదీ' ఎలా కీలక మలుపు తీసుకువచ్చిందో, ఇక చిరు సెకండ్ ఇన్నింగ్స్‌కు ‘ఠాగూర్’ కూడా అదే స్థాయిలో ల్యాండ్ మార్క్ సెట్ చేసింది. సమాజంలో పెరిగిపోతున్న లంచంపై ప్రశ్నిస్తూ, వైద్య రంగంలోని లొసుగులు సైతం బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. 2002లో విడుదలైన తమిళ చిత్రం ‘రమణ’కు ఇది రీమేక్. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ కాంత్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఆ తర్వాత 2003లో ఈ కథను వీవీ వినాయక్, మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించి సూపర్ డూపర్ సక్సెస్ సాధించాడు. అయితే, ఈ సినిమా రీమేక్ హక్కులు, ఒప్పందాల విషయంలో అప్పట్లో పెద్ద వివాదం చెలరేగింది. ఇప్పటికీ ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ చేసిన కామెంట్స్తో మరోసారి వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇపుడు ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారగా, అప్పటి పరిణామాలపై మళ్లీ చర్చ మొదలైంది.
ముందే అడ్వాన్స్ ఇచ్చా.. కానీ, పట్టుకెళ్ళిపోయారు..
ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ఠాగూర్ సినిమాను అసలు నేను చేయాల్సింది. ఆ సినిమా రీమేక్ హక్కులు నేను ముందే కొనుగోలు చేశాను. ఇందుకోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయితే, ఆ ప్రొడ్యూసర్ నా స్నేహితుడు కావడంతో, అగ్రిమెంట్ చేసుకోకుండా మాట మీదే నమ్మకం పెట్టుకున్నాను’’ అని రాజశేఖర్ తెలిపారు.
అయితే, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని మరో నిర్మాత (ఠాగూర్ మధు) రంగంలోకి దిగినట్లు ఆయన వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ అయిన ఆ ప్రొడ్యూసర్‌ను ఠాగూర్ మధు సంప్రదించాడు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి రీమేక్ హక్కులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ కథను చిరంజీవి కోసం తీసుకెళ్లిపోయాడు’’ అని చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ, ‘‘నేను లీగల్‌గా అగ్రిమెంట్ చేసుకోకపోవడం వల్లే ఆ సినిమా నాకు దక్కలేదు’’ అని అప్పటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారితీస్తూ, అప్పటి రీమేక్ హక్కుల వ్యవహారాన్ని మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘రాజశేఖర్ ఒక గొప్ప సినిమాను కోల్పోయారు. సినీ రంగంలో మాట మీద కాకుండా, వెంటనే అగ్రిమెంట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన చూపించింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Sir you were too good playing the character Sunil Narayan in BIKER , so please stop this nonsense and continue with work
— DEVA SALAAR (@RANVIJAYANIMAL) April 24, 2026
Hogaya so hogaya https://t.co/GSJ3IwKAmB
మొత్తానికి, ‘ఠాగూర్’ సినిమా ఒక వైపు సామాజిక సందేశంతో గుర్తింపు పొందగా, మరోవైపు రీమేక్ హక్కుల వివాదంతో కూడా ఇప్పటికీ చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఇక ఈ అంశంపై ఠాగూర్ నిర్మాతల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
రాజశేఖర్ 'మగాడు'..
హీరోగా అనేక చిత్రాల్లో మెప్పించిన రాజశేఖర్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇటీవలే ‘బైకర్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. శర్వాకు ఫాదర్‌గా, కోచ్‌గా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం పవన్ సాధినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాడు. రమ్య విశ్వదేవ్, శివానితో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. కొన్ని కథలు లైన్ లో పెట్టినట్లు సమాచారం.

