హైట్‌‌ ఎక్కువని రిజెక్ట్‌‌ చేశారు

హైట్‌‌ ఎక్కువని రిజెక్ట్‌‌ చేశారు

ఏడాది క్రితం ప్రసారమైన తెలుగు ‘బిగ్‌‌బాస్‌‌’ షో ద్వారా గుర్తింపుతెచ్చుకుంది దివి వధ్య్తా. లేటెస్ట్‌‌గా ‘మోస్ట్ డిజైరబుల్‌‌ ఉమన్‌‌ ఆన్‌‌ టీవీ 2020’గా నిలిచింది. ఇంత ఫేమ్‌‌ సంపాదించుకున్న దివి, కెరీర్‌‌‌‌ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పింది. ‘ఎత్తుగా ఉండటం వల్ల మొదట్లో చాలా అవకాశాలని కోల్పోయా. ఎక్కువ హైట్‌‌ ఉండటం నాకు ఎంతో ప్లస్​. అలాగే అంతే మైనస్​ కూడా. ఎన్నో ఆడిషన్స్‌‌లో రిజెక్ట్‌‌ చేశారు. తర్వాత ఒక ఎమ్​.ఎన్.సి.లో జాబ్‌‌ కోసం ట్రై చేశా. ఆ టైమ్‌‌లో జాబ్​ లేదు. లైఫ్‌‌లో జాబ్​ ఎంత ఇంపార్టెంటో అప్పుడు తెలిసొచ్చింది. ఇప్పుడు మాత్రం కావల్సినంత జాబ్​ ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్‌‌ లేకపోవడంతో చాలా ఇబ్బందులుపడ్డా. వాటి గురించి చెప్పుకొని సింపతీ పొందాలనుకోవట్లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన ప్రయత్నంమాత్రం కొనసాగించాలి. మన గురించి ఇతరులు ఏమనుకున్నా, వాళ్లకు సక్సెస్‌‌తోనే సమాధానం చెప్పాలి” అని చెప్పింది దివి. ప్రస్తుతం దివి నటించిన ‘క్యాబ్‌‌ స్టోరీస్‌‌’ ఓటీటీలో రిలీజైంది. మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.