నేను ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనే: మంత్రి సీతక్క

నేను ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనే: మంత్రి సీతక్క

ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనేనని మంత్రి సీతక్క అన్నారు. సేవకురాలుగా ములుగు ప్రజలకు తాను ఎల్లప్పుడు సేవలందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చేసేందుకే తనకు పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చారని.. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తామని సీతక్క తెలిపారు.