చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చెప్పారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎంపీ నిధులతో కొమురవెళ్లి మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కొమురవెళ్లిలో పర్యటించిన ఎంపీ మల్లికార్జున స్వామని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో తెలంగాణకి కేంద్రం నిధుల మంజూరులో అలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు. ఈ సారి తెలంగాణకి నిధులు మంజూరులో ఎంపీలు పోరాడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
హరీష్ రావు జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు వచ్చే నీటిని తపాస్ పల్లి రిజర్వాయర్ తో సిద్దిపేటకు తీసుకెళ్లి చేర్యాల రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ,గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
