భర్త చనిపోయిన ప్రతి మహిళకు ఉపాధి కల్పిస్తా

భర్త చనిపోయిన ప్రతి మహిళకు ఉపాధి కల్పిస్తా

బర్త్ డే సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఈటెల గుడ్ న్యూస్

కరీంనగర్: భర్త లేని మహిళల బాధలకు పరిష్కారం చూపిస్తా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో భర్త చనిపోయిన ప్రతి మహిళకు ఉపాధి కల్పిస్తానని నా పుట్టిన రోజు సందర్భంగా హామీ ఇస్తున్నా.. బ్యాంకుల వాళ్లతో నేనే మాట్లాడి గారెంటీ ఇచ్చి లోన్ ఇప్పిస్తానని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తనుగుల క్లస్టర్ రైతు వేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ... తన పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నా.. ఇందులో భాగంగా భర్తలు చనిపోయి పిల్లలు ఉన్న వారందరి బాధలకు పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాదు స్థలాలున్న వారికి  ఎవరి జాగాలో వాళ్లే ఇల్లు కట్టుకోవడానికి బడ్జెట్ లో అనుమతి వచ్చిందని, అలాగే తెల్ల రేషన్ కార్డులు రెండు సంవత్సరాల నుండి రావడం లేదు.. అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేస్తామన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులు మంచిగా పని చేసి జీవితం సార్ధకం చేసుకోండి, రైతులందరూ కలిసి కట్టుగా పని చేయాలని మంత్రి ఈటెల కోరారు.

రైతులు బిచ్చగాళ్ల లెక్క అడుక్కునే పద్ధతి ఉండొద్దు.. కేంద్రం చట్టంలో మార్పులు తేవాల్సిందే

కంపెనీల దయా దాక్షిన్యాల మీద ఆధారపడి ఇక్కడ రైతులు బతుకుతున్నారు.. అందుకే కొత్త నియమ నిబంధనలు, చట్టాలు అవసరం.. రైతులు బిచ్చగాళ్ల లెక్క అడుక్కునే పద్దతి ఉండవద్దు. కేంద్రం చట్టంలో మార్పులు తేవాల్సిందేనని మంత్రి ఈటెల పేర్కొన్నారు. అంకుషావలి చెరువు 365 రోజులు నీళ్లు నిల్వ ఉంచేలా చూసే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. సీడ్ మేల్, ఫిమేల్ వడ్లు ఫెయిల్ అవుతున్నాయి.. ఏ వస్తువు కొన్నా ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది.. వడ్ల కు కూడా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది.. అది అమలు చేయకపోతే ఎలామిల్లర్ల దగ్గరకి వెళ్లి తక్కువ ధరకు అమ్మే దుస్థితి రావొద్దు అని కోరుకున్నాము. సీఎం కేసీఆర్ నిన్న బడ్జెట్ లో వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతుకి లాభం జరిగితే రైతు మీద ఆధారపడ్డ వారందరూ బాగుపడతారు. తెలంగాణ రాక ముందు srsp కాలువలో పల్లేర్లు మొలిచినాయి.. తెలంగాణ వచ్చిన తరువాత వెయ్యి కోట్లు పెట్టి బాగు చేయించామని.. అందుకే ఇప్పుడు నీళ్లు నిండుగా పోతున్నాయి.. ఇప్పుడు వారబంది లేదు.. మానేరు మీద డ్యాంలు కడుతున్నాం.. మానేరు ఎండి పోయే పరిస్థితి రాదు. ఇక్కడ రైతులకు బోర్లు వెసే అవసరం, బాయిలు తవ్వే అవసరం లేదు.. రైతు వేదిక లో భూసార పరీక్షలు చేయిస్తారు. మందుల వాడకం ఎలా తగ్గించాలి, పెట్టుబడి ఎలా తగ్గించాలి చెబుతారు. సీడ్ కంపెనీలతో అగ్రిమెంట్ చేయిస్తుంది.. మద్దతు ధర ధాన్యం కొనుగోలు జరిగేలా చేస్తుంది..’’ అని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు.