మా కంటే మెరుగ్గా  మీ పథకాలుంటే రాజీనామా చేస్తా

మా కంటే మెరుగ్గా  మీ పథకాలుంటే రాజీనామా చేస్తా

రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో కంటే తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలు ఉంటే రాజీనామా చేస్తానని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాలు విసిరారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్. 

శనివారం వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రమేశ్ తో కలిసి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అనంతరం వేములవాడ పట్టణంలో 20 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణలో 9 మంది నిర్వాసితులకు 3.50 కోట్ల చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, అలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే చెప్పాలని సవాలు విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోసం చేసింది ఏమిలేదన్నారు. కాశీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ఇచ్చామని చెబుతున్న మోడీ.. తెలంగాణలోని వేములవాడకు ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. కాశీలో ఉన్న దేవుడు వేములవాడలో లేడా అని ప్రశ్నించారు. వేములవాడకు ఎన్ని నిధులు తీసుకొచ్చావని ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు. 

 

ఇవి కూడా చదవండి

రష్యాతో యుద్ధం చేసేందుకు తిరిగొచ్చిన ఉక్రెనియన్లు

డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు

జైలు కంటే వైద్యం ముఖ్యమని 1100 కోట్లతో కొత్త దవాఖాన