
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..,ఇయాన్ చాపెల్ కామెంటరీ కెరీర్కు పుల్ స్టాప్ పెట్టాడు. 45 ఏళ్లుగా కామెంటేటర్గా సేవలందించిన ఆయన..కామెంటరీ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చాపెల్ పంచుకున్నాడు.
రిటైర్ కావాల్సిన టైమొచ్చింది..
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోజు ఇప్పటికీ తనకు గుర్తుందని..ఆ రోజు అదే పనిగా వాచ్ చూస్తూ గడిపానని చాపెల్ చెప్పుకొచ్చాడు. సమయం 11 దాటాక..క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుని..గుడ్ బై చెప్పానన్నాడు. కామెంట్రీ పరంగా కూడా అదే ఆలోచిస్తున్నట్లు చాపెల్ వెల్లడించారు. ఇన్నాళ్లు కామెంటేటర్ గా సేవలందించడం సంతోషంగా ఉందన్నాడు. ఇప్పుడు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందన్నాడు. కొన్నేళ్ల కింద హార్ట్ ఎటాక్ వచ్చిందని..అప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితి మునుపటిలా ఉండటం లేదన్నాడు. ఈ సమయంలో తాను మరింత జాగ్రత్తగా ఉండాలని..అందుకే రిటైర్ అవుతున్నట్లు చాపెల్ చెప్పుకొచ్చాడు.
1977లో క్రికెట్కు వీడ్కోలు.
ఇయాన్ చాపెల్ ఆస్ట్రేలియా క్రికెట్లో ఆల్ టైం అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. చాపెల్ ఆసీస్ తరపున 75 టెస్టుల్లో ఆడాడు. 30మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అలాగే 16 వన్డేలు ఆడాడు. 1977లో క్రికెట్ నుంచి తప్పుకున్న చాపెల్..1980లో పూర్తి స్థాయి కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. సుమారు 45ఏళ్ల పాటు కామెంటరీ ప్యానెల్లో ఎన్నో మంచి విశ్లేషణలతో కూడిన కామెంట్రీ అందించాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కామెంటేటర్‌గా వెలుగొందాడు. 78 ఏళ్ల ఇయాన్ చాపెల్, చర్మ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. వృద్ధాప్య వ్యాధులతో సతమతమవుతున్నాడు. ఇయాన్ చాపెల్ తమ్ముళ్లు గ్రెగ్ చాపెల్, ట్రేవర్ చాపెల్ కూడా ఆస్ట్రేలియా కు ఆడారు.