వారిద్దరు ఒక్కటయ్యారు.. ఐఏఎస్, ఐపీఎస్ రిజిస్టర్ మ్యారేజ్

వారిద్దరు ఒక్కటయ్యారు.. ఐఏఎస్, ఐపీఎస్ రిజిస్టర్ మ్యారేజ్

చౌటుప్పల్, వెలుగు : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. పెండ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. ఎలాంటి ఆడంబరాలకు పోలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఇందుకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వేదికైంది. 

చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఐపీఎస్ అధికారిణి సూర్కంటి శేషాద్రినిరెడ్డి, ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం కుటుంబసభ్యులు, సన్నిహితులు, ఉన్నతాధికారుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం శేషాద్రినిరెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా.. శ్రీకాంత్ రెడ్డి ట్రైనీ ఐఏఎస్ గా ఉన్నారు. వీరు రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేసి పూలదండలు మార్చుకుని పెండ్లితో ఒక్కటయ్యారు.  కోట్లలో ఖర్చు చేసి చేసుకునేకంటే నిరాడంబరంగా పెండ్లి చేసుకుని యువతకు స్ఫూర్తిగా నిలిచారని పలువురు అధికారులు అభినందించారు.