సీసీఎస్లో ఐబొమ్మ రవి సంతకం.. నోటికి ప్లాస్టర్ ఉందంటూ మీడియాకు సైగలు

సీసీఎస్లో ఐబొమ్మ రవి సంతకం.. నోటికి ప్లాస్టర్ ఉందంటూ మీడియాకు సైగలు

బషీర్​బాగ్, వెలుగు: మూవీ పైరసీ కేసులో షరతులతో కూడిన బెయిల్​పై విడుదలైన ఐబొమ్మ వెబ్​సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి గురువారం బషీర్​బాగ్​లోని సీసీఎస్ కార్యాలయంలో హాజరయ్యారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ఆయన మొదటిరోజు తన సంతకం పూర్తి చేశారు. 

ఈ సందర్భంగా బయట వేచి ఉన్న మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించగా, రవి ఏమాత్రం నోరు విప్పకుండా కేవలం చిరునవ్వుతో దాటవేశారు. తన నోటికి ప్లాస్టర్ ఉందని సైగలు చేస్తూ, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.