ఐబీపీఎస్​ స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​

ఐబీపీఎస్​ స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​

ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ బ్యాంకింగ్‌‌ పర్సనల్‌‌ సెలక్షన్‌‌ (ఐబీపీఎస్‌‌) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్‌‌ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌ రిలీజ్​ చేసింది. గతంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని పనులనూ ప్రొబేషనరీ ఆఫీసర్లే చేసేవారు. లోన్లు, అకౌంట్స్, క్యాష్, అడ్మినిస్ట్రేషన్‌‌ విధులన్నీ నిర్వర్తించేవారు. ఇప్పుడు  ప్రతి విభాగంలోనూ స్పెషలైజ్డ్‌‌ ఆఫీసర్లను నియమిస్తున్నారు. ఎగ్జామ్​ ప్యాటర్న్​, సెలెక్షన్​ ప్రాసెస్​ గురించి తెలుసుకుందాం.

పోస్టులు–ఖాళీలు:  అగ్రికల్చరల్‌‌ ఫీల్డ్‌‌ ఆఫీసర్‌‌(స్కేల్‌‌-1) పోస్టులు 516, మార్కెటింగ్‌‌ ఆఫీసర్‌‌ (స్కేల్‌‌-1) ఖాళీలు 100, ఐటీ ఆఫీసర్‌‌ (స్కేల్‌‌1) జాబ్స్​ 44,  రాజ్‌‌భాష అధికారి (స్కేల్‌‌1) ఉద్యోగాలు 25,    లా ఆఫీసర్‌‌ (స్కేల్‌‌1) పోస్టులు 10, హెచ్‌‌ఆర్‌‌/ పర్సనల్‌‌ ఆఫీసర్‌‌ (స్కేల్‌‌1) ఖాళీలు 15 ఉన్నాయి.  

సెలెక్షన్ ప్రాసెస్​:  ప్రిలిమినరీ.. అర్హత పరీక్షగా ఉంటుంది. మెయిన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 80:20 నిష్పత్తిలో మార్కులను లెక్కిస్తారు. లా, రాజ్‌‌భాష అధికారి పోస్టులకు పరీక్ష విధానం ఒకేలా ఉంటుంది. మిగిలిన నాలుగు పోస్టులకు మరో విధానం ఉంటుంది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్‌‌ ఫీల్డ్‌‌ ఆఫీసర్, హెచ్‌‌ఆర్‌‌/ పర్సనల్‌‌ ఆఫీసర్, మార్కెటింగ్‌‌ ఆఫీసర్‌‌ పోస్టులకు ఇంగ్లిష్‌‌ లాంగ్వేజ్, రీజనింగ్‌‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్‌‌ సబ్జెకుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. లా ఆఫీసర్, రాజ్‌‌భాష అధికారి పోస్టులకు క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్‌‌ స్థానంలో జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌ ఉంటుంది. మెయిన్‌‌ పరీక్షలో ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెకులకు సంబంధినవే ఉంటాయి. అవన్నీ గ్రాడ్యుయేషన్‌‌ స్థాయిలో విద్యార్థులు చదివిన సబ్జెక్టులే కాబట్టి ప్రిలిమ్స్‌‌ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 

అర్హులైన అభ్యర్థులు నవంబర్​ 21 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.  జనరల్​ క్యాండిడేట్స్​ రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ప్రిలిమ్స్​ డిసెంబర్​ 24 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. మెయిన్స్​ జనవరి 29న ఉంటుంది. ఇంటర్వ్యూలు ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండే అవకాశం ఉంది. 1 నవంబర్​ 2022 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌‌ ప్రిలిమ్స్​ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.   పూర్తి సమాచారం కోసం www.ibps.in వెబ్​సైట్​ సంప్రదించాలి.