AFG vs IRE: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్‌లో ఓపెనర్లుగా మామ, అల్లుడు

AFG vs IRE: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్‌లో ఓపెనర్లుగా మామ, అల్లుడు

అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆటగాళ్లను అరుదుగా చూస్తూ ఉంటాం. దాదాపుగా బ్రదర్స్ ఎక్కువగా ఈ లిస్ట్ లో కనిపిస్తారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఫ్యామిలీ నుంచి రెండు తరాల వారు ఒకే మ్యాచ్ లో ఆడుతూ ఆశ్చర్యపరిచారు. ఐర్లాండ్- ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరిగిన టెస్టులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నేడు (ఫిబ్రవరి 28) అబుదాబిలోని టాలరెన్స్ ఓవల్‌లో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ తన అంకుల్ నూర్ అలీ జద్రాన్‌తో కలిసి జట్టు  ఇన్నింగ్స్ ను ఓపెన్  చేశారు. 

22 ఏళ్ల ఇబ్రహీం జద్రాన్ 35 ఏళ్ల నూర్ అలీ జద్రాన్ మేనల్లుడు. కొలంబోలో శ్రీలంకతో ఏకైక టెస్టు ప్రారంభానికి ముందు ఇబ్రహీం తన మామ నూర్ అలీకి తొలి టెస్ట్ క్యాప్‌ను అందజేశాడు. నూర్ అలీకి ఇది రెండో టెస్ట్ మాత్రమే. మరోవైపు ఇబ్రహీం జద్రాన్ కు ఇది 7వ టెస్ట్. 2009లో స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున అరంగేట్రం చేసిన నూర్ అలీ జద్రాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. నూర్ అలీ 51 వన్డేల్లో 1216 పరుగులు, 23 టీ20ల్లో 597 పరుగులు చేశాడు.     

ALSO READ :- Anudeep: జాతిరత్నాలు అనుదీప్ మౌనం..హీరోల సంఖ్యను పెంచేస్తోంది!

ఈ మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేసినా.. జట్టుకు మంచి ఆరంభం అందించలేకపోయారు. తొలి వికెట్ కు 11 పరుగులు మాత్రమే జోడించారు. నూర్ అలీ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 155 పరుగులకు ఆలౌటైంది. మార్క్ అదైర్ 5 వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు.